Mobile : మొబైల్ జోబులో పెట్టుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

Mobile : ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక స్మార్ట్ ఫోన్ కి ఉన్న ప్రాధాన్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మొబైల్ లేకుండా ఏ ఒక్కరి జీవితం సాఫీగా జరగని పరిస్థితి గా మారిపోయింది. అంతలా మొబైల్ ఫోన్లకి ప్రతిఒక్కరూ బానిస అయ్యారు. ఈ మొబైల్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మొబైల్ ఫోన్ అతిగా వాడడం వల్ల అన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1). మొబైల్ ను అతిగా వాడడం వల్ల మన కళ్ళు దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇక వీటితో పాటు నిద్ర రుగ్మతలు తలెత్తుతాయని పరిశోధనలు చేసి నిరూపించడం జరిగింది.

2). ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటోందని నిపుణులు తెలియజేస్తున్నారు.

3). అవసరం లేకపోయినా సరే చాలా మంది తమ మొబైల్ పడుకునేటప్పుడు దిండు కింద లేదా తమ దగ్గర పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. ఇక రాత్రిపూట దిండు కింద పెట్టుకొని నిద్రిస్తున్నట్లు అయితే ఇది చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ వల్ల వెలువడే రేడియేషన్ మెదడు పైన పని చేసే అవకాశం ఉంటుంది దీని వల్ల తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయట.

 Putting in a mobile packet Do you know how dangerous

Putting in a mobile packet Do you know how dangerous

4). ఎక్కువమంది కు మొబైల్స్ ని బ్యాక్ పాకెట్ లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటివి యువత లే ఫాలో అవుతూ ఉంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల కడుపు నొప్పి లేదా కాళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

5). ఇక మొబైల్ ని ఎక్కువగా షర్ట్ జేబుల్లో ఉంచుకుంటూ ఉంటారు. ఇలా ఫోన్ జేబులో పెట్టుకో వడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అందుచేతనే ప్రతి ఒక్కరూ ఇలా మొబైల్ ని పెట్టుకునే అలవాటు మానుకోవాలని లేకపోతే రేడియేషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు