Chandra Grahanam 2023: గ్రహణం పూర్తయిన వెంటనే అందరూ ఎవరికివారు శుద్ధి చేసుకుంటారు. ఇటీవల మొన్న చంద్రగ్రహణం అర్ధరాత్రి ఏర్పడిన సంగతి తెలిసిందే. అది సరిగ్గా అందరూ నిద్రపోయే సమయం. అయితే గ్రహణం వీడిన తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. దేవాలయాలు సైతం మోతబడతాయి. గ్రహణం సమయంలో దేవుడు విగ్రహాన్ని పూజకు సంబంధించిన వస్తువులను తాకటం కూడా నిషేధం. గ్రహణం సమయంలో రాహువు ప్రభావం చాలా బలంగా ఉంటుందని చెబుతారు.
ఆ సమయంలో ఏం చేసినా ప్రతికూల ప్రభావాలు చుట్టుప్రక్కల వస్తువులపై కూడా ఉంటుందంటారు. ఇదిలా ఉంటే గ్రహణం ముగిసిన వెంటనే.. చాలామంది ఇంటిని గంగాజలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత స్నానం చేస్తారు. కొంతమంది శరీరంపై నీళ్లు జల్లుకుని స్నానం చేసి తర్వాత దేవతలపై కూడా గంగాజలాన్ని జల్లుతారు. అంటే ఈ స్నానం చేసే సమయంలో దక్షిణ దిక్కు వైపు తిరిగి చేయకూడదట. అలా చేస్తే దోషాలు తగులుతాయని అంటున్నారు.
ఇదే సమయంలో చంద్రగ్రహణం రోజు ముందు లేదా తర్వాత స్నానం చేసే నెలలో కొన్ని తులసాకులు.. గోధుమలు కలుపుకొని స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు కుబేరులు అవుతారట. అంతేకాదు గర్భిణీ స్త్రీల గర్భం పై ఈ నీళ్లు ఉంచితే సురక్షితంగా శిశువు జన్మిస్తుందని కూడా నమ్మకం. ఈ రకంగా గ్రహణం సమయంలో తులసి ఆకులతో కుటుంబం మొత్తం స్నానం చేస్తే… ఆ కుటుంబంలో లేదా వ్యక్తి జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదట. ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటదట.