Mahesh Babu: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి జోరు మీద దూసుకుపోతోంది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క టెలివిజన్ రంగంలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” సినిమాలో ప్రభాస్ తల్లిగా మెప్పించిన రమ్యకృష్ణ తరువాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంది. ఇటీవల రజనీకాంత్ “జైలర్” సినిమాలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే ఒక ప్రముఖ ఓటీటీలో జడ్జిగా రావడం జరిగిందట.
అయితే ఆ షోలో ప్రజెంట్ ఉన్న హీరోలలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలియజేశారట. మహేష్ చాలా వైవిధ్యమైన సినిమాలను చేస్తూ ఉంటారు. ఆయన నటించిన సినిమాలలో “పోకిరి” అంటే చాలా ఇష్టం. కేవలం సినిమాలు మాత్రమే కాదు ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా నన్నెంతగానో ప్రభావితం చేస్తాయి. దీంతో మహేష్ పై రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. త్రివిక్రమ్ గత కొద్ది సినిమాలనుండి సీనియర్ హీరోయిన్స్ కి తన సినిమాలలో కీలకపాత్రలు ఇస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూ, అలా వైకుంఠపురంలో టాబు నటించడం జరిగింది. అయితే ఇప్పుడు మహేష్ తో చేయబోయే “గుంటూరు కారం”లో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.