Kartika Pournami: కార్తీక పౌర్ణమి స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు..!!

Kartika Pournami: కార్తీక మాసంలో పూజలు నది స్నానాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో  పౌర్ణమిని అత్యంత ముఖ్యమైన పవిత్రమైన రోజులలో ఒకటిగా భావిస్తారు. సనాతన ధర్మంలో దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసే పూజలు విష్ణుమూర్తికి శివుడి ఆరాధనకు అంకితం చేయబడుతుందని నమ్మకం.కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.

ఆ తర్వాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. దైవచింతన అవసరం. కార్తీక మాసంలో ప్రతి రోజూ దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది. ప్రతిరోజూ పూజ చేయలేనివారు క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాలు వెలిగించుకుని పూజ చేస్తే పుణ్యఫలం పొందుతుంది. కార్తీకమాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. శివుడిని ఆరాధించడం.. పంచామృతాలతో అభిషేకించడం.. నదీ స్నానాలు చేయడం.. చాలా మంచిది.

Just put this one in the bath water of Kartika Pournami

కార్తీక పౌర్ణమి రోజున శివుడిని పూజించి జ్వాలాతోరణం దర్శించుకోవాలి. అలాగే కార్తీక మాసంలో వనభోజనాలు కూడా నిర్వహిస్తారు. కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత సాయంత్రం నమకం, చమకం. పురుష, శ్రీ సూక్తాదులతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయాలి. కార్తీక శుద్ద ద్వాదాశి రోజున తులసి కోట వద్ద ఉసిరి కొమ్మ ఉంచాలి. తులసి కోటను లక్ష్మీ స్వరూపంగా .. ఉసిరిని మహా విష్ణువుగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించాలి. మరి కార్తీక మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత వీడియోలో తెలుసుకుందాం.