Bigg Boss స్టార్ మా ఛానల్ కి ఓ పేరుంది ఓ రేంజ్ ఉంది.. ముఖ్యంగా ఈ ఛానల్లో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటుంది.. బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ షో ని స్టార్ మా యాజమాన్యం ఆపేయాలని నిర్ణయం తీసుకుంటున్నారట.. అందుకు సీజన్ 6 కి వచ్చిన టిఆర్పి రేటింగ్ ఏ కారణమట.. ఇంతకీ ఎంత టిఆర్పి రేటింగ్ వచ్చిందో తెలిస్తే మీరే తీసేయమంటారు..
బిగ్ బాస్ మొదటి సీజన్ 14.2 టిఆర్పి సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత అన్ని సీజన్స్ కూడా 14 టిఆర్పి కంటే తక్కువే దక్కించుకున్నాయి. కానీ నాలుగవ సీజన్ మాత్రం 21.7 టిఆర్పి సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ 6 వ సీజన్ గ్రాండ్ ఫినాలేకి కేవలం 6 టిఆర్పి మాత్రమే వచ్చిందట.. ఒకప్పుడు 14 టిఆర్పి రేటింగ్ లో కూడా సాగిన బిగ్ బాస్ ఎక్కడ.. ఇప్పుడు 6 టిఆర్పి రేటింగ్ లో కొనసాగుతున్న బిగ్బాస్ సీజన్ 6 ఎక్కడ.. అంటే ప్రేక్షకులకి ఈ సీజన్ 6 ఎంత బోరింగ్ గా అనిపించిందో ఈ టిఆర్పి రేటింగే నిదర్శనం. ముందు నుంచి ఈ సీజన్ చెత్తలా ఉందని నెటిజన్స్ గోల పెడుతున్నారు.. ఒక విధంగా చెప్పాలంటే స్టార్ మా సీరియల్స్ కూడా ఇంత తక్కువ టిఆర్పి రేటింగ్ రావడం లేదు. కేవలం మధ్యాహ్నం ప్రసారమయ్యే స్టార్ మా టీవీ సీరియల్స్ కి ఈ టి ఆర్ పి రేటింగ్ వస్తుంది.. ఇక దీన్ని బట్టి చూస్తే స్టార్ మా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కరెక్టే అవుతుంది. అందుకే బిగ్ బాస్ సీజన్ సిక్స్ ని నెక్స్ట్ సీజన్ ని ఆపేయాలని అనుకుంటున్నారట. దానికి బదులు మరో మంచి సోని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది..