Balakrishna: నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ ఈ షో మొదటి షో సీజన్ ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పడం లేదు.. ఈ షో రెండవ సీజన్ మొదటి షో తోనే లోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన వారసుడు నారా లోకేష్ వచ్చారు ఆ షో అనూహ్యమైన రికార్డులను కొల్లగొడుతుంది.. బాలయ్య షోకి రమ్మని వైఎస్ఆర్సిపి మంత్రి రోజాకు ఆహ్వానం వచ్చిందని టాక్.. ఈ విషయంపై రోజా బాలకృష్ణ స్పందించిన తీరు ప్రకంపనలు రేపుతున్నాయి.

రోజా మాట్లాడుతూ.. నాపై వస్తున్న ట్రోల్స్ ను నేను పట్టించుకోను. గతంలో టిడిపి వాళ్ళు నన్ను ట్రోల్ చేసేవారు.. ఇప్పుడు వాళ్లకి జనసేన వారు తోడయ్యారు. వాస్తవాలు లేకుండా వారు నన్ను విమర్శిస్తుంటారు. అయితే అన్ స్టాపబుల్ షో కి రమ్మని నాకు ఆహ్వానం వచ్చింది. కానీ నేను ఆ షో కి రాను. ఎందుకంటే నందమూరి తారక రామారావు ను వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. కానీ ఆ షో చంద్రబాబు అలా చేయలేదు అని చంద్రబాబు ను బాలయ్య బాబు వెనకేసుకొచ్చారు. అది చాలా దారుణం.. అలాంటి టాక్ షో కి నేను వెళ్ళను అన్నారట రోజా.
బాలకృష్ణతో నాకు మంచి పరిచయం ఉంది. మేమిద్దరం కలిసి నటించాం. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కి నన్ను రమ్మని ఆహ్వానించారు ఆ సమయంలోనే అసెంబ్లీ వ్యవహారాల్లో గందరగోళం ఏర్పడింది. దాంతో పార్టీ కి నష్టం కలుగుతుందని నేను ఆ షో కి రానని చెప్పాను.. నేనే ఆ షో కి వెళ్తే పార్టీకి రాంగ్ మెసేజ్ వస్తుందని.. బాలకృష్ణ షో కి నేను వెళ్లడం లేదు . అయినా చంద్రబాబు మాట్లాడిన మాట తీరు నాకు ఏమీ నచ్చడం లేదు. నిజాలను దాచేసి అబద్దాలను మాత్రమే మాట్లాడారని రోజా ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించారు. అయితే బాలకృష్ణ అండ్ స్టాపబుల్ షో కి నేను రానని చెప్పినా మంత్రి రోజా మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న బాలయ్య కూడా తనదైన శైలిలో స్పందించారు. ఈ షో చాలా జెన్యూన్ గా జరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడే మీలాంటి వాళ్లకు ఆ విషయం అర్థం కాదులే.. నువ్వే నా షో కి వస్తాను అన్నా.. నా షో కి నేను నిన్ను రానివ్వనని రోజా కు బాలయ్య మాస్ కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.