Chandrababu: టీడీపీ అభిమానులకు గుడ్ న్యూస్ విడుదల కాబోతున్న చంద్రబాబు నాయుడు…!!

Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. రిమాండ్ ఖైదీగా దాదాపు నెల రోజులకు పైగా జైల్లోనే ఉంటూ వస్తున్నారు. ఇటీవల డిహైడ్రేషన్ కారణంగా అనారోగ్యానికి కూడా గురికావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబుకి బెయిల్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ కి సంబంధించి మంగళవారం విచారణ జరగనుంది.

ఈ కేసులో 17A వర్తింప చేయాలన్న పిటిషన్ తో పాటు ఫైబర్ నెట్ స్కామ్ లో ముందస్తు బయలు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్లకు సంబంధించి సరికొత్త వార్త ఏమిటంటే చంద్రబాబు బయలు విషయంలో కోర్టు నుండి అనుకూలమైన తీర్పు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కేసు పూర్వపరాలు టెక్నికల్ పాయింట్స్ పట్టి చూస్తే చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నట్లు.. మంగళవారం ఆయన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీలో నాయకులు డిస్కషన్ చేసుకుంటున్నారు.

Chandrababu Naidu is about to release good news for TDP fans

ఈ టైంలో చంద్రబాబు బయటకు వస్తే కచ్చితంగా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలవడం తధ్యమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు కావటంతో తెలుగుదేశం పార్టీకి మంచి పొలిటికల్ మైలేజ్ సింపతి రావటం జరిగిందని అంటున్నారు. సో ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు మళ్ళీ ప్రజా జీవితంలో అడుగుపెట్టబోతున్నట్లు గట్టిగ టాక్ వినిపిస్తుంది.