Hyper Aadi : బుల్లితెరపై జబర్దస్త్ ఒక సంచలనం.. సుమారు 8సంవత్సారాలు క్రితం మొదలైన ఈ కామెడీ షో తిరుగులేకుండా దూసుకుపోతోంది.. అప్పట్లో అత్యధిక టి ఆర్పి రేటింగ్ చేసుకున్న షో గా కూడా నిలిచింది.. టిఆర్పి రేటింగును కూడా కొన్నేళ్లపాటు జబర్దస్త్ షో శాసించింది.. సామాన్యులు గా ఉన్న వారిని కూడా ఈ షో ద్వారా స్టార్ కమెడియన్స్ గా గుర్తింపు పొందరు అటువంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు..
హైపర్ ఆది కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తన పంచులతో మనస్ఫూర్తిగా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య. స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు హైపర్ ఆది తన టాలెంట్ తో దూసుకెళ్తున్నాడు. ఇంత బాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హైపర్ ఆది ఆస్తులు వెనుక చేయడంలో కూడా ముందున్నాడు.. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని సొంత ఊరులో ఇప్పటికే సుమారు 16 ఎకరాలు కొన్నారని.. అలాగే తన తండ్రికి పది వేలకు పది బంగారపు ఉంగరాలు కూడా చేయించారని ఆయనే చెప్పారు.
ఇక తాజాగా హైపర్ ఆది హైదరాబాదులో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. మరి ఇంతగా ఇల్లు ఆస్తులు వెనకేస్తున్నాడంటే సంపాదన కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా.. ఒక్కొక్క ఈవెంట్ ను బట్టి ఆది రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట.. ఆది ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్కొక్క స్కిట్ కిగాను లక్ష రూపాయలు రెండునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీన్నిబట్టి టీవీ షోల ద్వారానే ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.