NTR: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ టీం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు తర్వాత కుటుంబ సభ్యులు ఇంకా వివిధ పార్టీల నేతలు జైలులో ఆయనతో ములాఖత్ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు నారా కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది.
ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని రకరకాల కామెంట్లు రావటం తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుని కలవడానికి దాదాపు 1000 కార్లతో రాజమండ్రి కి బయలుదేరటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారట. అంతేకాదు 2024 తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుతో జైల్లో భేటీ అయి ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పార్టీలో టాక్ నడుస్తుంది.
తెలుగుదేశంలో సైతం ఎన్టీఆర్ రావాలని చాలామంది నాయకులు కేడర్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కష్ట పరిస్థితుల్లో ఉండటంతో ఎన్టీఆర్ సైతం.. తన వంతు కృషిచేసి వచ్చే ఎన్నికలలో పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో వేటి కావడానికి వేయికారులతో ఎన్టీఆర్ హైదరాబాదు నుండి బయలుదేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది.