Happy Kartika Pournami: ప్రస్తుతం కార్తీక మాసం కొనసాగుతోంది. ప్రతి ఏటా దీపావళి మర్నాడు ఈ మాసం స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం దీపావళి మర్నాడు కాకుండా రెండో రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ క్రమంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అత్యంత ప్రాముఖ్యమైన రోజుగా పండితులు తెలియజేస్తుంటారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలు తప్పనిసరిగా వెలిగించి నదులలో దీపాలను వదలడంతోపాటు పండితులకు దీప దానం చేయడం వంటివి చేస్తుంటారు.
ఈ పుణ్యదినాన ఆదిదేవుడు అనుగ్రహాన్ని పొందుకోవడానికి రకరకాల పూజలు చేస్తుంటారు. కార్తీక పౌర్ణమి హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన పండుగ. ఈ రోజున భక్తులు శివుని ఆరాధిస్తారు. ఈ రోజున శివుడు కార్తీక పూర్ణిమా స్నానం చేసి, పార్వతి దేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో..దీపారాధన చెయ్యడమంటే ముక్కోటి దేవతలను పూజించడమే..సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది..ఇహ లోకంలో సుఖ సౌఖ్యాలు..పరలోకంలో ముక్తి లభిస్తాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడు పూజలతో పాటు చేసే కొన్ని పరిహారాలు చాలా కష్టాల నుండి తొలగించే శక్తి ఉంటుందట. ఈ క్రమంలో ఒకే ఒక రూపాయి నాణెంతో ఆర్థిక కష్టాలను తొలగించుకుని లక్ష్మీదేవి కటాక్షం పొందుకునే అవకాశం ఉందట. పౌర్ణమి గడియాలలో సాయంత్రం పూట ఈ పరిహారం పాటించాల్సి ఉంటుంది. అదేంటో కింది వీడియోలో పూర్తిగా చూడండి.