Mahesh Babu: సీనియర్ హీరో వేణు అందరికీ సుపరిచితుడే. 1999లో “స్వయంవరం” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కె విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాలో నేను లయ ఇద్దరు హీరో హీరోయిన్ లుగా నటించడం జరిగింది. ఈ సినిమాలో వేణు పంచ్ డైలాగులు అప్పట్లో సినిమా ప్రేమికుల ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించి తర్వాతనే ఒక అవకాశాలు అందుకుని ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందాడు.
ఆ తర్వాత వరుస పరాజయాలు పలకరించడంతో.. సినిమాలకు దూరం కావడం జరిగింది. అనంతరం ఇటీవల నేను మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలో నటించాలని సీనియర్ హీరో వేణు కి ఫోన్ చేసినట్లు వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతుంది. వేణు కామెడీ టైమింగ్ తనకి ఎంతో ఇష్టమని.. ప్రత్యేకంగా ప్రస్తుతం చేస్తున్న “గుంటూరు కారం” డైరెక్టర్ త్రివిక్రమ్ తో మాట్లాడి అతనికొక ఇంపార్టెంట్ రోల్ సినిమాలో కల్పించాలని కోరడం జరిగిందట.
ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే క్లైమాక్స్ లో ఒక బలమైన పాత్ర ఉండటంతో దానికి సీనియర్ హీరో వేణుని మహేష్ సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ వేణు నటించిన సినిమాకి పనిచేయడం జరిగింది. దీంతో త్రివిక్రమ్ కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.