Weight Loss: ప్రపంచంలో జీవనశైలి మారుతూ ఉండటంతో మనిషి ఆరోగ్యంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో మాదిరిగా మనిషి పెద్దగా నడవలేకపోతున్నాడు పరిగెత్తలేని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీతో కూడిన ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో కూర్చోవడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. దీంతో ఒంట్లో కొవ్వు బాగా పేరుకుపోయి అనేక అనారోగ్యాలకు గురవుతున్నాడు.
ప్రస్తుత సమాజంలో చాలా మంది కంప్యూటర్స్ ముందు పని చేసే వాళ్లు ఎక్కువ. సో దీంతో చాలామందికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంతో పొట్టలు తన్నుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో పొట్ట తగ్గించుకోవడానికి చాలామంది ఎక్సర్సైజులు.. మెడిసిన్స్ వాడి విఫలమవుతున్నారు. కానీ యోగాలో పలు ఆసనాలు పొట్టను ఇట్టే కరిగించేస్తాయి. ఉన్న బరువును వారం వ్యవధిలోనే తగ్గిపోయే రీతిలో.. యోగాసనాలకు మంచి శక్తి ఉంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వెబ్ మీడియాలో సింధూర యోగ అనే ఆమె చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ క్రమంలో పొట్ట తగ్గించుకోవడానికి ఆమె వేసిన యోగాసనాలు వీడియో మీకోసం. ఈ వీడియోలో కూర్చుని కాళ్లతోనే రకరకాల యోగాసనాలు వేయడం జరిగింది. వీటిని క్రమంగా వేస్తే ఫలితాలు త్వరితగితన చూడగలుగుతామని ఆమె పేర్కొంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కలిగిన వాళ్లు.. ఈ ఆసనాలు వేయడం ద్వారా చాలా త్వరగా బరువు తగ్గుతారని తెలపడం జరిగింది.