Kodali Nani YS Jagan: వైసీపీ అధినేత సీఎం జగన్ కి పార్టీలో అత్యంత నమ్మకస్తులైన వారిలో ప్రధమంగా వినబడేది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చాక రాజకీయంగానే ఒక ఇబ్బందులు జగన్ ఎదుర్కొంటున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని.. జగన్ కి మద్దతు తెలిపారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి అత్యంత క్లిష్ట సమయంలో పార్టీకి అండగా నిలబడి జగన్ మీద పార్టీ మీద ఎవరు ఎలాంటి కామెంట్లు చేసిన తిప్పికొడుతూ ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగారు.
ఇదిలా ఉంటే 2019 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిండు అసెంబ్లీ సభలో తన పార్టీలో తాను మొదటిగా నమ్మే ప్రధాన వ్యక్తి కొడాలి నాని అని జగన్ తెలియజేశారు. ఆ తర్వాత మొన్న గుడివాడ నియోజకవర్గంలో టిడ్కో ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమాలలో సీఎం జగన్ అదిరిపోయే స్పీచ్ ఇవ్వటం తెలిసిందే.
ఈ ఏడాది మే నెలలో జరిగిన ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకా ఇల్లు అందుకున్న లబ్ధిదారులందరికీ వరాలు కురిపించడం జరిగింది. 2019 ఎన్నికల ప్రచారంలో గుడివాడలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని ఇంకా అదనపు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కూడా కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.