Mahesh Babu: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన గుర్రాన్ని కొనుగోలు చేసిన మహేష్ బాబు వీడియో..!!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్.. అదేవిధంగా హోటల్ రంగంలో కూడా అడుగుపెట్టడం జరిగింది. అదేవిధంగా నిర్మాణ సంస్థ కూడా సొంతంగా పెట్టి రాణిస్తూ ఉన్నారు. ఇన్ని రకాలుగా విజయవంతంగా రాణిస్తున్న మహేష్ బాబు తాజాగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుర్రాన్ని కొనుగోలు చేయడం జరిగిందట.

విషయంలోకి వెళ్తే ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి గాను… మహేష్ ముందుగా గుర్రాన్ని కొనుగోలు చేయడం జరిగిందట. సినిమా షూటింగ్ మొదలయ్య టయానికి అలవాటు చేసుకోవడానికి.. మహేష్ కొన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వచ్చే ఏడాది రాజమౌళితో చేయబోయే సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఆలోపు ఈ గుర్రాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే విధంగా మహేష్ వారంలో రెండు మూడు రోజులు… గుర్రానికి మేత వేస్తూ మంచి చేసుకుంటున్నారట.

Mahesh Babu bought the most expensive horse in the world

రాజమౌళి ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. “RRR” సినిమా అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడంతో.. మహేష్ సినిమా దానికి మించి అన్న రీతిలో తీయబోతున్నారట. ఈ క్రమంలో వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు విడుదల కాబోతుంది.