CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh – Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ సమయంలో నరసాపురం ఎంపీగా గెలవడం జరిగింది. అంతకుముందు అనేక పార్టీలలో పార్లమెంట్ కి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికలలో జగన్ హవాకి ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలవడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత కొద్ది నెలలకే వైసీపీ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ తీసుకునే అనేక నిర్ణయాలను మీడియా సమక్షంలో వైసీపీ ఎంపీగా విభేదించేవారు. ఈ రకంగా జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ చాలా పొగరుగా వ్యవహరించేవారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొన్ని కేసుల నమోదు కావడంతో.. మకాం మొత్తం ఢిల్లీ మార్చేయడం జరిగింది. ఇక ఢిల్లీ వేదికగా చేసుకుని తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే ఎల్లో మీడియా చానల్స్ కి ప్రతిరోజు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం చేపట్టి అనేక కార్యక్రమాలను న్యాయస్థానాల సాక్షిగా అడ్డుకోవడానికి తెగ తాపత్రయపడేవాళ్లు.

cm ramesh serious comments on raghuramakrishnamraju
cm ramesh serious comments on raghuramakrishnamraju

ఈ క్రమంలో అనేక పిటిషన్లు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రకంగా నాలుగు సంవత్సరాలు పాటు జగన్ కి వ్యతిరేకంగా రాణిస్తూ ఇప్పుడు సరిగా ఎన్నికల సమయానికి మళ్లీ నరసాపురం ఎంపీ బరిలో తానే నిలబడుతున్నట్లు మొన్నటిదాకా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ.. కూటమిలో భాగంగా తానే పోటీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మొన్నటిదాకా హడావిడి చేయగా చివర ఆఖరికి రఘురామకృష్ణ రాజుకు టికెట్ దక్కలేదు. నరసాపురం ఎంపీ టికెట్ స్థానిక బీజేపీ.. నాయకుడు శ్రీనివాస్ వర్మకు కేటాయించడం జరిగింది. ఈ పరిణామంతో రఘురామకృష్ణరాజు ఎదవ అయిపోయారు. అయితే తనకు టికెట్ రాకపోవడానికి కారణం వైఎస్ జగన్ అంటూ మొన్నటిదాకా టీవీ చానల్స్ లో సోషల్ మీడియాలో విమర్శలు చేయటం జరిగింది.

cm ramesh serious comments on raghuramakrishnamraju
cm ramesh serious comments on raghuramakrishnamraju

బీజేపీ… పెద్దలపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. పరిస్థితి ఇలా ఉంటే అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తున్న బీజేపీ నేత సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామరాజుకి టికెట్ రాకుండా చేసింది జగన్ కాదు.. ఆయన చేసిన పనికిమాలిన పనుల వల్ల టికెట్ రాకుండా పోయిందని అన్నారు. బీజేపీ.. పెద్దలపై ఎవ్వరు ఒత్తిడి తీసుకొని వచ్చే పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు.. తాను విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేయాలని భావించినట్లు కానీ బీజేపీ పెద్దలు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మారు మాట్లాడకుండా పోటీకి దిగినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా సృజనా చౌదరిని ఎమ్మెల్యేగా పోటీకి దింపారని.. భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎవరి ఒత్తిడికి లొంగరని.. సీఎం రమేష్ ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.