Weight Loss: నేటి సమాజంలో జీవనశైలి విభిన్నంగా ఉండటంతో చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. సమాజంలో సగానికి పైగా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీంతో అనేకమంది గుండె సంబంధిత సమస్యలు, చర్మ సమస్యలు, ఊపిరి ఆడకపోవడం, నిద్ర పట్టడంలో ఇబ్బంది వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఊబకాయం మనకు తెలియకుండానే కొన్ని లక్షణాలతో కూడిన వ్యాధులు మరియు రుగ్మతలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ క్రమంలో బరువు తగ్గటం అనేది నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారిపోయింది. ఎన్ని మందులు వర్కౌట్స్ సర్జరీలు చేయించుకున్న.. లావు తగ్గని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి.. ఒక సింపుల్ డ్రింక్ చిట్కా ఉంది. అదేమిటంటే ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి.. ఆ నీటిలో దాల్చిన చెక్క వేయాలి. తరువాత ఆ వేడి చేసిన నీరు కలర్ మారిన తర్వాత… స్టవ్ ఆఫ్ చేసి.. నీళ్లు గోరువెచ్చగా అయ్యేవరకు వెయిట్ చేయాలి.
ఇలా గోరు వెచ్చని నీరు గ్లాసుల్లో తీసుకుని పరగడుపున తాగాలి. ఈ రకంగా ఈ మిశ్రమాన్ని తీసుకొని అరగంట వరకు ఏమీ తినకూడదు.దాల్చిన చెక్క శరీరంలో చక్కెర స్థాయిని కడుపులో మంటను మెదడు.. పనితీరు మెరుగుపరచడంలో సామర్థ్యంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కతో ఇంకా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు పరకడుపున ఈ మిశ్రమాన్ని తాగుతూ ఉంటే రెండు వారాలలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.