Anemia: భారతదేశ మహిళలు అనీమియా గురించి ఎక్కువగా తెలుసుకోవలసిన విషయాల వీడియో..!!

Anemia: ప్రపంచంలో చాలా దేశాలలో స్త్రీలు జీవన విధానం ఉంటుంది. భారతదేశంలో స్త్రీల జీవన విధానం అందరికీ భిన్నంగా ఉంటుంది. ఇంట్లో చాలా వరకు పనులు చేసుకుంటూ.. పిల్లలను చూసుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కువగా రక్తహీనత..అనీమియా బారిన పడుతున్న స్త్రీలలో భారతదేశ మహిళలే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలలో బయటపడటం జరిగింది.

రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ ప్రోటీన్ లోపంతో.. పాటు ఐరన్ లేకపోవడం ఇందుకు కారణమాట. భారతదేశ మహిళలలో దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉందని పరిశోధనలలో తేలింది. రక్తంలో తగినన్ని ఎర్ర రక్త కణాలు లేకపోవడనీ అనీమియా అంటారు. శరీరంలోని 100 గ్రాముల రక్తంలో… హిమోగ్లోబిన్‌ పరిమాణం పురుషుల్లోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనతతో బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు.

Things Indian women need to know more about anemia

అసలు రక్తహీనత అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలిపేందుకు ఈ ప్రత్యేక వీడియో మీకోసం. ఈ వీడియోలో యూట్యూబ్ లో ఎంతో పేరు సంపాదించిన ప్రముఖ తెలుగు వైద్యులు రవికాంత్ కొంగర.. మహిళల శరీరంలో రక్తం పోషించే పాత్ర గురించి చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ఐరన్ శరీరంలో ఎంత మోతాదులో ఉండాలి ఏ రకంగా మహిళలు రక్తం లేకపోతే పడే ఇబ్బందులు వంటి విషయాలు తెలియజేయడం జరిగింది.