Chaganti Koteswara Rao: తెలుగు రాష్ట్రాలలో ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు అందరికీ సుపరిచితుడే. హిందూ మతానికి సంబంధించి అనేక విషయాలను వివరిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించారు. వ్యక్తిత్వ పరంగా ఇంకా కుటుంబ పరంగా మనిషి ఏ విధంగా జీవిస్తే సమాజానికి మేలు చేకూరుతుంది..? జీవించకపోతే వచ్చే పర్యవసనాలు చక్కటి పురాణాల కథల రూపంలో వాస్తవికతను తెలియజేస్తూ ఉంటారు. ఈ రకంగానే సౌమీనీ అనే బ్రాహ్మణ కులానికి చెందిన ఆ అమ్మాయి కథ చాగంటి కోటేశ్వరరావు తెలియజేయడం జరిగింది.
ఈ కథలో సౌమీనీ అనే బ్రాహ్మణ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అదే కులానికి చెందిన మరో అబ్బాయితో ఆమెకు వివాహం జరుగుతుందని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు పెళ్లయిన కొద్ది నెలలకే భర్త మరణించడం జరిగిందని చెప్పుకొస్తారు. భర్త చనిపోవడంతో సౌమీనీనీ అప్పట్లో పురుషులు చాలామంది ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. అటువంటి బలహీనమైన స్థితిలో ఆనాడు కట్టుదిట్టమైన ఆచారాలు చేత బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా.. వేరే వర్గానికి చెందిన వ్యక్తి వశం అయిపోయింది. దీంతో బ్రాహ్మణులు ఆమెను విడిచిపెట్టడం జరిగింది. ఆ వ్యక్తి వశమయ్యాక సౌమీనీ ఒక బిడ్డకు జన్మనివ్వడం జరుగుద్ది.
అయితే సౌమీనీకి అక్కడ వాతావరణ అలవాటయ్యి రోజు కళ్ళు తాగడంతో పాటు మాంసం లేనిదే ముద్ద దిగేది కాదు. చెడిపోయిన బ్రాహ్మణుడు ప్రవర్తించే వ్యగ్రంగా మరెవ్వరూ ప్రవర్తించలేరు. ఒక్కసారి బ్రాహ్మణుడు మార్గం తప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అంటే బ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాడు. అలాంటి వారిని సమాజంలో నేను చాలామందిని చూశాను అంటూ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ఈ సౌమీనీ అనే బ్రాహ్మణ అమ్మాయి కథ సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.