Diwali 2023: ఈ నవంబర్ 12 వ తారీకు ఆదివారం అమావాస్య రోజు దీపావళి పండుగ రావడం జరిగింది. ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి నెల అమావాస్య పౌర్ణమి.. వస్తుంటాయి. అయినప్పటికీ కొన్ని అమావాస్య పౌర్ణమి.. తిధులు కొన్నిటికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రాముఖ్యత కలిగిన రోజులలో గనుక కొన్ని పరిహారాలు చేస్తే.. మంచి జరుగుతుందని.. అనుకున్న ఫలితం శీఘ్రంగా వస్తుందని చాలామంది నమ్ముతుంటారు.
సాధారణంగా అమావాస్య అంటే చాలామంది భయపడతారు. ఆరోజు అసలు ఇంటి నుండి అడుగు బయటకు కూడా వెయ్యరు. అమావాస్య అనేది ఒక చెడ్డ రోజుగా పరిగణిస్తూ ఉంటారు. కానీ కొన్ని అమావాస్యలు మాత్రం చాలా ప్రత్యేకం.. ఆరోజు గనుక.. పరిహారాలు చేస్తే.. ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య నుండి విముక్తి కలుగుతుందట. అన్ని అమావాస్యలలో దీపావళి అమావాస్య అనేది చాలా ముఖ్యమైనది.
దీపావళి అమావాస్యనాడు ధ్యానం మౌనరాధన.. చేయటం వల్ల ఒక వ్యక్తి తాను పడుతున్న.. బాధల నుంచి పాపాల నుంచి విముక్తి పొందగలుగుతాడు. అంతే కాదు.. లక్ష్మీదేవిని ఈ దీపావళి అమావాస్యనాడు ఆరాధిస్తే.. సకల శుభాలు కలుగుతాయట. అంతేకాదు కొడుకులు కలిగిన కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు… పడే బాధలు అమావాస్యనాడు కొన్ని పనులు చేస్తే కూడా విముక్తి కలుగుతుంది అంట. చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకుంటున్నా కొడుకుల గురించి బాధపడుతున్న తల్లిదండ్రులు చేయాల్సిన పనులు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది.