Beauty Benefits : చర్మ సమస్యలను దూరం చేసే ఆయుర్వేద మూలికలు..!!

Beauty Benefits : చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ అయినప్పుడు మనం ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ పైన ఆధారపడుతూ ఉంటాము. అంతేకాదు మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ బారినపడకుండా ఆయుర్వేద మూలికల తో చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రకృతి వనం లో మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి. ఇక ఈ మొక్కలకు ఆయుర్వేద శాస్త్రంలో మంచి స్థానం కూడా ఉంది. ఇక ఆయుర్వేద శాస్త్రంలో ఉపయోగపడే కొన్ని రకాల మూలికలు చర్మ సమస్యలను ఎలా దూరం చేస్తాయో ఒకసారి చదివి తెలుసుకుందాం.

1. చందనం : అత్యంత ఖరీదైనది మాత్రమే కాదు అత్యంత ప్రభావ శాలి కూడా అని చెప్పవచ్చు. ముఖ్యంగా జిడ్డు చర్మం కలవారు చందనం పొడిని రోజ్ వాటర్లో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అదే పొడి చర్మం గల వారు అయితే చందనం పొడిని పచ్చి పాలలో కలుపుకుని ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. అంతేకాదు ఎండాకాలంలో వచ్చే నల్లటి మచ్చలు దూరం అవుతాయి.

Beauty Benefits with chandan Bale juice
Beauty Benefits with chandan Bale juice

2. బేల్ రసం : వేసవి కాలంలో వచ్చే కడుపు నొప్పి, మొటిమలు, మచ్చలు అధికం అవుతాయి. అలాంటప్పుడు ఈ బేల్ రసం తాగడం వల్ల శరీరంలో ఉష్ణం బయటకు పోయి మొటిమలు, మచ్చలు దూరం అవుతాయి.

3. అలోవెరా ఆకు : వేసవికాలంలో చర్మాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది . అంతేకాదు జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ముఖ్యంగా అలోవేరా ఆరోగ్య విషయంలో కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ముఖంపై వచ్చే మచ్చలు మొటిమలు గీతలు అన్నీ కూడా దూరం అవుతాయి. ఇలా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.