Lakshmi Devi :ఎవరైనా.. ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటకు బయలుదేరేటప్పుడు కొన్ని పనులు చేయడంవల్ల చేసిన పని సవ్యంగా సాగుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. అంతే కాదు పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా ఆచరణలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక్కో రోజు ఒక్కో పనిని సూచిస్తుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు..
కాబట్టి ముందుగా మనం సోమవారం రోజు ఏదైనా పని పైన బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఒకసారి చూసుకొని వెళ్తే మీ పని సక్సెస్ అవుతుందిఇక మంగళవారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుని బయటకు వెళుతూ ఉంటే అనుకున్న పనులు సవ్యంగా సాగుతాయి. బుధవారం రోజు ధనియాలు నోట్లో వేసుకుని బయట అడుగు పెట్టడం వల్ల తలపెట్టిన పని జరుగుతుంది అని చెబుతున్నాడు. ఇక గురువారం రోజున జీలకర్ర నోట్లో వేసుకుని నమ్ముతూ ఆ నీటిని తాగడం వల్ల మీరు అనుకున్న పని విజయవంతం అవుతుంది. అంతేకాదు ఆర్థిక లాభం కూడా చేకూరుతుంది.

శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించబడే పెరుగు – చక్కెర కలిపి తిని బయటకు వెళ్లడం వల్ల ఎంత కష్టమైన పని అయినా సరే సులభంగా పూర్తి అవుతుంది. అంతే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంది డబ్బు నష్టం కలగకుండా కాపాడుతుంది.ఈ రోజు శనివారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళితే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆదివారం రోజు కిల్లీ లేదా తమలపాకును వేసుకుని బయటకు వెళ్లి మీరు అనుకున్న విధంగానే పనులు సవ్యంగా సాగిపోతాయిఇక ఇలాంటి చిట్కాలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కచ్చితంగా మీ పనులు విజయవంతం అవుతాయి.