Bhojanam : అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనం భోజనం చేసేటప్పుడు తప్పకుండా కాళ్ళు , చేతులు కడుక్కుని మరి భోజనానికి కూర్చోవడం ఆనవాయితీ. మరి కొంత మంది అయితే ముందుగా దేవుడిని స్మరించుకుని ఆ తర్వాత భోజనం చేస్తారు. ఎవరు ఎంత కష్టపడినా సరే పొట్టకూటికే కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఉంటే అంతే చాలు అని భావించే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. ఇంతటి దైవస్వరూపంగా భావించే అన్నం విషయంలో మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి .. కానీ ఇప్పటికే చాలా మంది కొన్ని తప్పులను భోజనం చేసిన తర్వాత చేస్తూ ఉంటారు.
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి మీరు చేసే ఇలాంటి పొరపాట్ల వల్ల దరిద్రం పట్టిపీడిస్తోంది.భోజనం చేసేటప్పుడు.. చేసిన తర్వాత చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం. భోజనం చేసేటప్పుడు మీరు తినే కంచం నుండి ఒక్క మెతుకు కూడా బయట పడకుండా జాగ్రత్త పడాలి. ఇక భోజనం చేసిన తర్వాత ఒకవేళ కిందపడ్డ మెతుకులను వెంటనే తీసి పక్కకు వేయాలి. ఇక కంచంలో చేతులు అసలు కడగకూడదు. అయితే తిన్న ప్లేటు ఎండి పోకూడదు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. చేతులు కడిగినా.. కంచం ఎండిపోయినా కూడా దరిద్రం అని చెబుతారు. అందుకే తిన్న వెంటనే ప్లేట్ శుభ్రం చేయాలి.

చాలామంది ఆహారం ముగించి నిద్రపోయే ముందు గిన్నెలను శుభ్రం చేయడం లేదా అన్నింటిని బయటపెట్టి ఎండిపోకుండా నీళ్లు పోయడం లాంటివి చేస్తూ ఉంటారు.భోజనం చేసే సమయంలో దగ్గు, తుమ్ము వస్తే మాత్రం వెంటనే పక్కకు వెళ్లి చేతులు కడుక్కుని వచ్చి మళ్లీ భోజనం చేయాలి . ఒకవేళ అలాగే తింటే అది పరమ దరిద్రం. భోజనం నేలపై మాత్రమే కూర్చొని తినాలి. ఇక తిన్నాక చేతులు విధిలించకుండా కడుక్కున్న చేతులను శుభ్రంగా తుడుచుకోవాలి. కొంతమంది తిన్న వెంటనే నిద్ర పోతూ ఉంటారు. అది పరమ దరిద్రానికి కారణం అవుతుంది .కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త వహిస్తే అన్నపూర్ణ దేవికి మీపై అనుగ్రహం కలుగుతుంది.