Mahesh Babu Surya: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో సందడి చేసిన హీరో సూర్య జ్యోతిక..!!

Mahesh Babu Surya: సూపర్ స్టార్ మహేష్ బాబు బాల్యం చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. చెన్నైలోనే పాఠశాల విద్యతోపాటు ఇంటర్మీడియట్ కూడా చదవటం జరిగింది. అయితే మహేష్ పాఠశాలలోనే తమిళ హీరో సూర్య కూడా చదవడం జరిగింది. అప్పటినుండి మంచి ఫ్రెండ్షిప్ వీళ్లిద్దరి మధ్య ఉంది. ఈ విషయాన్ని సూర్య తమ్ముడు కార్తీక్ కూడా ఒకానొక టైంలో తెలియజేసారు. అయితే పెద్దాయన తరువాత అటు తమిళ్ ఇండస్ట్రీలో సూర్య ఇటు తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు ఇద్దరికిద్దరు అగ్ర హీరోలుగా రాణిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల్ల హైదరాబాద్ నగరానికి హీరో సూర్య తన భార్య జ్యోతిక తో రావడం జరిగిందట. ఈ క్రమంలో మహేష్ ఇంటికి వెళ్లడం జరిగిందట. ఆ సమయంలో మహేష్ ప్రజెంట్ దర్శకత్వం చేస్తున్న గుంటూరు కారం సినిమా విశేషాలతో పాటు రాజమౌళితో చేయబోయే సినిమా విశేషాలు కూడా సూర్య అడిగి తెలుసుకున్నట్లు టాక్. ఈ క్రమంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న “గుంటూరు కారం” సినిమా ట్రైలర్ చూసి చాలా కాలం తర్వాత మాస్ సినిమా చేస్తున్నారని.. సూర్య కామెంట్లు చేశారంట.

Suriya shifts to Mumbai with wife Jyotika and kids; leaves his parents alone for the first time | Tamil Movie News - Times of India

కాగా తెలుగులో ఒక ప్రముఖ దర్శకుడుతో సూర్య సినిమా చేయడానికి రెడీ కావడం జరిగింది అంట. అయితే ఆ దర్శకుడు పనితనం గురించి ముందుగా మహేష్ ని అడిగి తెలుసుకున్నట్లు టాక్. సూర్యకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆ టాలీవుడ్ దర్శకుడు తో భారీ పాన్ ఇండియా సినిమా.. సూర్య ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.