Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ హీరోలలో ఒకరు. జయపజయాలతో సంబంధం లేకుండా మహేష్ సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి. ఓపెనింగ్స్ రాబట్టడంలో కూడా మహేష్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క అనేక సహాయ కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. చాలామంది చిన్న పిల్లలకు ఉచితంగా గుండా ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. చారిటీ చేయటంలో మహేష్ ఎప్పుడు కూడా ముందుంటాడు.
మహేష్ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు ఆఖరికి మహేష్ కూతురు.. సితార కూడా తన మొదటి సంపాదన చారిటీకి ఇవ్వడం విశేషం. ఇటువంటి మహేష్ బాబుకి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని డిసైడ్ కావటం జరిగింది అంట. ఈ క్రమంలో మహేష్ బాబు చిన్నపిల్లలకు ఉచితంగా చేపిస్తున్న గుండాపరేషన్లకు 3000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ తో కూడిన హాస్పిటల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
మహేష్ బాబు బంధువు తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయంలో కేంద్ర పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. ఇదే సమయంలో బిజెపి నాయకులు సైతం మహేష్ చేసే మంచి పనులు తెలుసుకొని.. కేంద్ర పెద్దలకు స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేసినట్లు.. త్వరలో మహేష్ చేపట్టే గుండాపరేషన్లకు హాస్పిటల్ రెండు తెలుగు రాష్ట్రాలలో కట్టించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతగా మహేష్ బాబుకి ప్రాధాన్యత ఇవ్వటం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షాక్ అయినట్లు సమాచారం.