Jio : దేశంలోనే ప్రైవేటు టెలికాం దిగ్గజమైన రిలయన్స్ జియో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. రిలయన్స్ జియో కస్టమర్లను, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అధునాతన ప్రయోజనాలతో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక వీటివల్ల అధిక డేటా లభించడంతోపాటు అధిక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అలాగే వివిధ యాప్లను ఉచితంగా సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం గమనార్హం. అంతేకాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లెక్స్ వంటి OTT యాప్ లను కూడా ఉచితంగా సబ్స్క్రిప్షన్ చేసుకునేందుకు వీలుగా ఉండే రీఛార్జ్ ప్లాన్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది జియో. ఇకపోతే రూ.100 లోపు రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించడం గమనార్హం.
ఇక ఇప్పటికే తక్కువ ధరకే డేటా ఓచర్లను అందిస్తున్న రిలయన్స్ జియో ఇప్పుడు తక్కువ ధరకే రీఛార్జి ప్లాన్స్ ని కూడా అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక మీరు కూడా రూ. 100 లోపు రీఛార్జ్ ప్లాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ ప్లాన్ వివరాలు గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. జియో రూ.91 రీఛార్జి ప్లాన్ : జియో ఫోన్ యొక్క రూ.91 విలువచేసే రీఛార్జ్ ప్లాన్ మీకు 28 రోజులపాటు చెల్లుబాటును అందిస్తుంది. అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు ఏ నెట్వర్క్ కైనా సరే అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు 50 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందుతారు. ఇక డేటా విషయానికి వస్తే.. రూ.91 ప్లాన్ తో 3 GB డేటా కూడా లభిస్తుంది.. అంటే ఈ ప్లాన్ ద్వారా మీకు ప్రతిరోజు 100 MB డేటా లభిస్తుంది. అంతేకాదు జియో యాప్ లకు సంబంధించి జియో టీవీ..
జియో సినిమా.. జియో క్లౌడ్.. జియో సెక్యూరిటీ.. వింక్ మ్యూజిక్.. తదితర జియో యాప్ల సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అపరిమిత వాయిస్ కాలింగ్ కోసం ఎదురుచూసే వారికి ఈ ప్లాన్ అద్భుతమైనది అని చెప్పవచ్చు. ఇక మీలో ఎవరైనా సరే వంద రూపాయల లోపు రీఛార్జ్ చేసుకుంటే చాలు అని ఆలోచించేవారు.. పెద్దగా డేటాతో వినియోగం లేని వారు ఈ రీఛార్జ్ ప్లాన్ ను చేసుకోవచ్చు. తక్కువ ధర ఎక్కువ కాలం మన్నిక .. కాబట్టి 100 రూపాయల లోనే 28 రోజులపాటు నిర్విరామంగా మొబైల్ కాల్స్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది..