Earbuds : ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల అద్భుతమైన ఫీచర్స్ తో కూడిన ఇయర్ బడ్స్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి రావడం గమనార్హం . ఇక బడ్జెట్ ధరలో ఇయర్ బడ్స్ కొనాలనుకునే వారికి దేశీయ బ్రాండ్ నాయిస్ నుంచి బడ్జెట్ రేంజిలో మరో TWS ఇయర్ బడ్స్ వచ్చేసాయి. ప్రస్తుతం ఫ్లై బడ్స్ డిజైన్తో డిఫరెంట్ లుక్ ను ఈ బడ్స్ కలిగి ఉండడం గమనార్హం. ఇక చార్జింగ్ కేస్ తో కలిపి 36 గంటల ప్లే టైం కూడా ఉంటుంది. పరిసరాల శబ్దాల నుంచి కాల్స్ కి ఇబ్బంది కలగకుండా ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ఈ బడ్స్ వస్తున్నాయి. మరి ఈ బడ్స్ యొక్క పూర్తి విషయాలు మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
Noise Buds VS102 Plus ధర రూ.1,199 మాత్రమే ఈ కామర్స్ సైట్ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ లో ఆగస్టు 29వ తేదీ నుంచి అమ్మకానికి ఉంచబోతున్నారు. ఇక కలర్స్ విషయానికి వస్తే ఫారెస్ట్ గ్రీన్ , స్నో వైట్ , స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ బడ్స్ మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 11ఎంఎం సౌండ్ డ్రైవర్ తో నాయిస్ బడ్స్ విఎస్ 102 ప్లస్ ఇయర్ బడ్స్ వస్తున్నాయి. ఆడియో ఎక్స్పీరియన్స్ బాస్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉంటుంది అని సమాచారం . ముఖ్యంగా వెరైటీ లుక్ ను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ కోసం బ్లూటూత్ రేంజ్ 10 మీటర్లు ఉన్నా సరే సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక చార్జింగ్ కేస్ మూత ఓపెన్ చేయగానే కనెక్ట్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇక ఒకసారి చార్జి చేస్తే 36 గంటలు ప్లే బ్యాక్ టైం వస్తుంది. అంతేకాదు పది నిమిషాలు చార్జింగ్ తో 120 నిమిషాలు వినియోగించుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఇక అంతే కాదు ఇన్స్టా ఛార్జ్ టెక్నాలజీకి ఈ బడ్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. చార్జింగ్ కోసం కేసుకు టైప్ సీ పోర్టు అందుబాటులో ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ కోసం IPX 5 రేటింగ్ తో ఈ ఇయర్ బర్డ్స్ వస్తున్నాయి. ఇకపోతే ఇంత అధునాతన టెక్నాలజీతో కలిగి ఉన్న ఈ బడ్స్ కేవలం రూ.1, 200 లోపు మాత్రమే లభించడం. ఇక వీటిని కొనుగోలు చేయడానికి కూడా కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.