Infinix : ఇన్ఫినిక్స్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. ఈసారి ఏకంగా 108 ఎంపీ కెమెరా..!

Infinix : ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫినిక్స్ తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో మొబైల్ తన ఫీచర్స్ తో, టెక్నాలజీ తో కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర ఇలా అన్ని వివరాలను ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

Advertisement

ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో మొబైల్లో మీడియా టెక్ హీలియో G99 ప్రాసెసర్ తో ఉంటుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ లభించడం గమనార్హం. 90Hz రిఫ్రెష్ రేట్, 180 Hz టచ్ షాంప్లింగ్ రేటు ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 3 లెన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో 108 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా, మరో ఏఐ కెమెరా కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఇన్ఫినిక్స్ మొబైల్ కు అందివ్వడం గమనార్హం. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

Advertisement
Another smartphone from Infinix.. this time with a 108 MP camera..!
Another smartphone from Infinix.. this time with a 108 MP camera..!

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 4G LTE, వైఫై, డ్యూయల్ సిమ్, జిపిఎస్ ట్రాకర్, యూఎస్బీ టైప్ సి , బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ మొబైల్ వస్తోంది. డిటిఎస్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ ఉండే డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. మొత్తంగా 192 గ్రాముల బరువు ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ తో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999 గా నిర్ణయించబడింది. ఇక కలర్స్ విషయానికి వస్తే టుస్కానీ బ్లూ, వాల్కనిక్ గ్రే, అల్పైన్ వైట్ వంటి కలర్ ఆప్షన్స్ లో కూడా లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ పై ఆఫర్స్ కూడా ప్రకటించడం గమనార్హం. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో మొబైల్ ను ఫస్ట్ సెల్లో ఎవరైతే కొనుగోలు చేస్తారో ఏదైనా క్రెడిట్ , డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1, 500 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement