Big Boss 6 Telugu : హౌస్ లోంచి బయటకొచ్చిన గంటల్లోనే శ్రీ సత్యా పరువు మొత్తం తీసేసిన బాలాదిత్య .. శ్రీహన్ తో అఫైర్ గురించి మొత్తం చెప్పేశాడు ?

Big Boss 6 Telugu : బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేష‌న్స్ జ‌రుగుతున్నాయి. టాప్ 5లో ఉంటార‌నుకునే వారు హౌజ్ నుండి ఎలిమినేట్ అవ్వ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. శ‌నివారం నటుడు బాలాదిత్య ఊహించ‌ని విధంగా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. మంచి హ్యూమన్ బీయింగ్ అని నిరూపించుకున్న బాలాదిత్య ఇలా వ‌చ్చేయ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. గీతు మాదిరిగా కాకుండా.. నవ్వుతూనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వ‌చ్చిన‌ బాలాదిత్య… స్టేజ్ మీదికి వచ్చిన తరువాత ఒక్కొక్కరి గురించి అద్భుతంగా మాట్లాడి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు . రేలంగి మావ‌య్య‌కు ఇలా కూడా చాలా మంది అభిమానులు పెరిగారు.

baladitya-open-up-on-sri-satya
baladitya-open-up-on-sri-satya

Big Boss 6 Telugu : క్లారిటీ ఇచ్చేశాడు..

అయితే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ ద్వారా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్న విష‌యం తెలిసిందే.తాజాగా ఎలిమినేట్ అయిన బాలాదిత్య‌ను యాంక‌ర్ శివ ప‌లు ప్ర‌శ్న‌లు అడిగాడు. ఈ క్ర‌మంలో శ్రీ స‌త్య గురించి కొన్ని ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. శ్రీసత్యకు నోటి దురుసు అని బాలాదిత్య చెప్పుకు రాగా, శ్రీసత్యకు ఉందా.. ఏ విషయంలో అని యాంకర్ శివ ప్రశ్నించ‌డంతో నామినేష‌న్స్ స‌మ‌యంలో ట్రిగ్గ‌ర్ అవుతుంది. ఎవరైనా కొంచెం ట్రిగ్గర్ చేస్తే లౌడ్ అయిపోతుందని అన్నాడు బాలాదిత్య‌. ఇక శ్రీహాన్ గురించి చెబుతూ అత‌ను స్మార్ట్ ప్లేయర్ అని అన్నాడు.

ఇక శ్రీహాన్.. శ్రీ సత్యని గొప్ప ఫిగర్ అని పొగడటం.. ఆమెకు ముఖానికి ఏదో అంటుకుంటే దాన్ని తీయడం.. చూసి అంద‌రు వారిద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌ని అనుకున్నారు. రేవంత్ కూడా వీరిద్ద‌రి విష‌యంలో నోరు జార‌డంతో ఏం జ‌రుగుతుందా అని అనుమానాల‌తో ఉన్నారు. బాలాదిత్య వారి రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఇద్ద‌రు మంచి ఫ్రెండ్స్, అంతే త‌ప్ప వారిద్ద‌రి మ‌ధ్య వేరేది ఏం లేద‌ని అ్న‌నాడు. దీంతో పుకార్లకి క్లారిటీ అయితే వ‌చ్చింది.