Friday : శుక్రవారం రోజు ఇలా పూజ చేస్తే చాలు.. డబ్బుకు లోటు ఉండదు..!!

Friday : సాధారణంగా వారంలో ఏడు రోజులు వున్నట్లుగానే ప్రతి వారం కూడా ఒక భగవంతుడికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఇక అలా శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రీతికరమైన రోజుగా భావించడం ఆనవాయితీ. ఇక పోతే ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలకా.. అప్పటికీ అప్పులపాలు అవుతూ ఉంటే జీవితం ఎలా అయోమయంలో పడుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన చేతిలో డబ్బు ఎలా ఖర్చు అవుతుందో మనకు కూడా తెలియకుండానే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇకపోతే మన చేతిలో డబ్బు నిలవకపోవడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. అలాంటి వాటిలో వరాలు అందించే తల్లి ధనలక్ష్మి అమ్మవారి కటాక్షం లేకపోవడం వల్ల డబ్బు నిలవలేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అయితే మన చేతిలో డబ్బు లేకపోతే కొంత మంది ధనరేఖ లేదేమో అని అంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ తొలగి పోవాలి అంటే కచ్చితంగా అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజున కొన్ని నియమ నిబంధనలతో పూజిస్తే తప్పకుండా పోగొట్టుకున్న సిరిసంపదలు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇకపోతే అమ్మవారిని శుక్రవారం ఎలా పూజించడం వల్ల మనకు ధనప్రాప్తి కలుగుతుంది అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇకపోతే అమ్మవారి పూజలో నిమగ్నమయ్యే వారు ఖచ్చితంగా శుక్రవారం రోజున తలంటు స్నానం చేసి పసుపు , ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులలో ఏదైనా మీకు నచ్చిన రంగు దుస్తులు ధరించాలి.

It enough to do puja on Friday in Money
It enough to do puja on Friday in Money

తరువాత పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో భక్తి నియమాలతో అమ్మవారి పూజ పూర్తి చేసిన తరువాత దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరడమే కాదు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కూడా చేకూరుతుంది.శుక్రవారం రోజున అమ్మవారికి తెల్లని పువ్వులు, జాజిపూలు , మల్లెలు సమర్పిస్తే శుభఫలితాలుంటాయి. ఇక శుక్రవారం విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లి గరిక మాల సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ముఖ్యంగా వీలైతే మీరు పదిమంది ముత్తైదువులకు పసుపు , కుంకుమలను వాయినంగా ఇవ్వడం మరింత శ్రేయస్కరం. భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి అని అప్పుడే అన్ని బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ను మరిన్ని పొందాలంటే ముందుగా ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా అందరికీ షేర్ చేయండి.