Health Benefits : 5రూపాయల ఈ ఆకుకూర లక్షలు పోసిన నయం కానీ వ్యాధులను తగ్గిస్తుంది.!

Health Benefits : నిత్యం మనకు లభించే ఆకుకూరలు చుక్కకూర కూడా ఒకటి.. రుచికి పుల్లగా ఉండే ఈ ఆకు కూరలు విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.. ఈ ఆకుకూరను పప్పు, పులుసు, పచ్చడి ఇలా రకరకాలుగా వంటలు చేసుకొని తినవచ్చు.. చుక్కకూర వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!ఒక కప్పు చుక్కకూర 123 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎముకలను దృఢంగా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన త్వరగా ఆకలి లేదు. దాంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలు రాకుండా అడుగుతుంది. మలబద్దకం ను నివారిస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకుకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ.

Health Benefits Of Chukka Kurra
Health Benefits Of Chukka Kurra

ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డగిస్తుంది.ఈ ఆకుకూర శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలో ఉన్న వేడినీ తగ్గిస్తుంది. చుక్కకూర ఆకుకూర రసం తీసుకొని కొద్దిగా పాలు లేదా పెరుగు కలిపి 3 రోజులపాటు తీసుకుంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. ఈ ఆకుల రసం లో చిటికెడు సోడా ఉప్పు కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతుంది. 3 చుక్కలు ఈ ఆకుల రసం చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. తేలు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది ఈ ఆకుల రసం.