Financial loss : భోజనం చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా.. ఆర్థిక నష్టం తప్పదట..!!

Financial loss : హిందూ సాంప్రదాయం ప్రకారం పూర్వీకులు ప్రతి పనిని నియమ నిబంధనలతో ఒక పద్ధతిగా చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కాలం మారుతున్న కొద్ది ఈ పద్ధతులన్నీ మారిపోతున్నాయ్ అని చెప్పవచ్చు. ఇకపోతే మన పూర్వీకులు పాటించిన పద్ధతులలో శాస్త్రీయత కూడా ఉంది. ఇక వీటిని పాటించడంలో మన జనరేషన్ వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. ఇక మన పూర్వీకులు తీసుకొచ్చిన పద్ధతులలో భోజనం చేయడం దగ్గర కూడా ప్రత్యేకంగా కొన్ని పద్ధతులు పాటించాలి. ఇకపోతే భోజనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. లేకపోతే అరిష్టం ఉంటుంది. ఒక్కోసారి ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి.

ఇకపోతే తిన్న భోజనం వంటికి పట్టాలన్నా.. శాంతి చేకూరాలన్నా కూడా భోజనం ఒక పద్ధతిలో చేయాలి. ఇక భోజనం వండే టప్పుడు కూడా కచ్చితంగా స్నానం చేయాలి. దంతాలను శుభ్రం చేసుకొని వంట తయారు చేయాలి. వంట చేసేటప్పుడు కాళ్లకు చెప్పులు ధరించరాదు. ఇక భోజనం తిన్న తర్వాత తినడానికి ముందు కాళ్లు , చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇకపోతే భోజనం తినక ముందు స్నానం చేయాలి. కానీ భోజనం తిన్న తర్వాత స్నానం చేయకూడదు. అలా చేస్తే తిన్న ఆహారం వంటికి పట్టదు. కాళ్ళను, చేతులను తడిలేకుండా శుభ్రంగా తుడుచుకొని తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చొని మాత్రమే భోజనం చేయాలి.

Doing this while eating except for financial loss
Doing this while eating except for financial loss

ఇతరులకు భోజనం వడ్డించేటప్పుడు వండించే పదార్థాలను కంచానికి తగలకుండా వడ్డించాలి. ఇక గరిటలు కంచానికి తగిలితే అది ఎంగిలి అవుతుంది అని.. ఆ పదార్థాలను ఇతరులకు వడ్డించడం వల్ల అది దోషం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. ఇకపోతే ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు మిగిలిన అన్నాన్ని వారికి వడ్డించకూడదు. ఆహార పదార్థాలను ఉంచిన గిన్నెలకు కాళ్లను తగిలించకూడదు.. భోజనం చేసేటప్పుడు నీళ్ల గ్లాసు కుడివైపున మాత్రమే ఉంచుకోవాలి. . భోజనం చేసిన తరువాత విస్తరలను ఎత్తే వారికి వచ్చే పుణ్యం అన్న దానం చేసే వారికి కూడా రాదు అని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఆర్థిక నష్టం ఉండదు. లేకపోతే అటు అన్నపూర్ణ దేవి కి.. ఇటు లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.