Health Benefits : పరగడుపున ఈ ఆకుల రసం ఒక్క గ్లాస్ తాగితే..!

Health Benefits : మానవుని ప్రతి సమస్యకు ప్రకృతిలో సమాధానం దొరుకుతుంది.. పచ్చని ప్రకృతిలో ఎన్నో వనరులు ఉన్నా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనుషులకు తెలియదు.. జుట్టు పెరిగే మొక్కలే దివ్య ఔషధాలు.. కానీ వాటి గురించి తెలుసుకోము.. పట్టించుకోము.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో నేలఉసిరి కూడా ఒకటి.. ఈ మొక్కకు చింతాకుల్లా చిన్న చిన్న ఆకులు ఉంటాయి.. ఈ ఆకులకు స్టోన్ బ్రేకర్ అని కూడా పేరు. ఎందుకంటే ఈ మొక్క ఎముకలు విరిగినప్పుడు ఉపయోగిస్తారు.. నేల ఉసిరి కి ఎన్నో పేర్లు ఉన్నట్టే.. దీని వలన ఉపయోగాలు కూడా ఉన్నాయి..!

నేల ఉసిరి లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంది. నేల ఉసిరి ఆకులను దంచి రసం తీసుకోవాలి. ఉదయం పరగడుపున ఈ ఆకుల రసాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే డయాబెటిస్ కు చెక్ పెడుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. కడుపులో మంట, లుకొరియా, మూత్ర ఇన్ఫెక్షన్లను, బాధాకరమైన మూత్రవిసర్జన ను తగ్గిస్తుంది. కాలేయం నుండి పిత్త ఉత్పత్తిని పెంచుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది జీవ క్రియలు చురుకుగా ఉంచుతుంది ఈ జ్యూస్ తీసుకోవడం

Health Benefits Of Nela Usiri Plant
Health Benefits Of Nela Usiri Plant

వల్ల కిడ్నీ లో రాళ్ళు కరిగిపోవంతోపటు కామెర్లు, హెపటైటిస్ ను తగ్గిస్తుంది.ఆకలి లేని వారు నెల ఉసిరి ఆకుల్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా నమిలితే ఆకలి వేస్తుంది. ఈ చెట్టు ఆకులు ఉప్పుతో కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని గజ్జి, తామర త్వరగా ఉన్నచోట రాస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. పుండ్లు, గాయాలను కూడా నయం చేస్తుంది. విరిగిపోయిన ఎముకలు అతికించే శక్తి ఈ ఆకులను ఉంది. ఎముకలు విరిగిపోతే ఈ ఆకులను పట్టి లాగా వేసి కడతారు. దాంతో ఎముకలు మళ్లీ అతుక్కుంటాయి.