Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ తప్పులు చేయకండి..!!

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నంలో కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఫలితంగా ఆర్థిక నష్టాలు , ఆర్థిక సంక్షోభం, కుటుంబంలో కలహాలు, గొడవలు ఇలా ప్రతిదీ నష్టం వాటిల్లుతుంది. మరీ ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. మరి ఆ తప్పులు పొరపాటున చేశారో ఆర్థిక సంక్షోభం తప్పదు. . ఇక ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

లక్ష్మీదేవిని పూజించాలి అంటే కేవలం అమ్మవారిని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజించకూడదు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు విష్ణుమూర్తి తో సహా పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది . అలాగే కృష్ణమూర్తి దయ కలగడం వల్ల ఆర్థిక సంపదకు నష్టం వాటిల్లదు. ఇక ప్రతి శుక్రవారం కూడా ఇంటిముందు దీపం వెలిగించే టప్పుడు ఆవు నెయ్యి తో మాత్రమే దీపం పెట్టాలి. అలాగే తులసి కోట దగ్గర ప్రతి రోజు ఉదయం , సాయంత్రం దీపం వెలిగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది.ఇక సాయంత్రం వేళల్లో దీపం పెట్టిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్కకు నీరు పోయకూడదు.

Do not make these mistakes if you want to get the grace of Lakshmi Devi
Do not make these mistakes if you want to get the grace of Lakshmi Devi

ఇలా సాయంత్రం సమయంలో తులసి మొక్క పొదల్లో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి సతీసమేతంగా ఉంటారని వారికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇలా నీళ్లు పోయకూడదు అని చెబుతారు. ఇక గోరు తగిలేలా తులసి ఆకులను కత్తిరించి కూడదు. ఇక తులసి ఆకులను కోసేటప్పుడు కూడా తులసి మంత్రం జపించిన తర్వాత నే తులసి మొక్క నుండి ఆకుల తీయాలి. ఇక సుచి శుభ్రత పాటించినప్పుడు మాత్రమే తులసి మొక్కను తాకడం మంచిది. ఇక ఇంట్లో సంపద ఉండే స్థలాన్ని కూడా స్నానమాచరించిన తర్వాత ని ముట్టుకోవాలి.. లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ లభించదు ఇక ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా అన్ని నియమాలు పాటిస్తే తప్పకుండా సంపద పెరుగుతుంది.