High Blood Pressure : అధిక రక్తపోటును తగ్గించుకోవాలంటే వీటిని తగ్గించాల్సిందే..!!

High Blood Pressure : ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని వెంటాడుతున్న సమస్యల్లో అధిక రక్తపోటు కూడా ఒకటి. దీని కారణంగా రక్త ప్రవాహం పై అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా సమస్య అధికమైనప్పుడు తలనొప్పి రావడం, గుండె సంబంధిత సమస్యలు చుట్టుముట్టడం , మరింత ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. ఇకపోతే అధిక రక్తపోటు ఒకసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే చాలామంది దీనిని సైలెంట్ కిల్లర్ అని చెబుతారు. ఇకపోతే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహార నియమాలు పాటిస్తే అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అధిక పోటును తగ్గించుకోవాలి

అంటే మనం వేటిని తగ్గించాలి అనే విషయం కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.ముందుగా ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.. ముఖ్యంగా అన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయి అంటే అధిక రక్తపోటు సోడియం తో ముడిపడి ఉంటుంది. ఇక రోజువారీ దినచర్యలో ఉప్పు తక్కువ తినడం వల్ల అధిక రక్తపోటు సమస్యను తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఎవరైనా సరే ఉప్పును తగ్గిస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. పైగా గుండెజబ్బులు కూడా దరిచేరవు. ఇక సోడియం తక్కువ తీసుకునే వారితో పోలిస్తే రోజుకు 2800 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ తీసుకునే వారిలో చక్కెరవ్యాధి వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తేల్చి చెప్పారు.

To reduce high blood pressure
To reduce high blood pressure

డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.పొటాషియం అధికంగా తీసుకోవాలి.. అధిక రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. కాబట్టి వీటిని కూడా తీసుకోకూడదు. మీకు కావాలి అంటే ఆకుకూరలు, తాజాపండ్లు , టమోటాలు, చిలకడ దుంపలు, బంగాళదుంపలు, అరటి పండ్లు , అవకాడో , నారింజ పండ్లు , పాలు, పెరుగు వంటివి తీసుకోవచ్చు.