Vastu Tips : ఏ పూల మొక్కను ఏ దిశలో నాటితే ఆర్థికవృద్ధి మెరుగుపడుతుందో తెలుసా..?

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో పూల మొక్కలు ఏర్పాటు చేసుకోవడం వల్ల శాంతి , యశస్సు పెరగడంతో పాటు సంపద కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. సంపద వృద్ధి చెందాలంటే తప్పకుండా రంగురంగుల పూల మొక్కలను ఇంటి దిశలలో పెంచడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఇకపోతే ఏ పూల మొక్కలను ఏ దిశలో నాటితే ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది.. మనశ్శాంతి కలుగుతుంది..అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1.మందార పువ్వు : ఎరుపు రంగు మందార పువ్వులను దుర్గాదేవికి, హనుమంతుడికి ప్రీతికరంగా భావిస్తారు. ఎరుపు రంగు పువ్వులను వినాయకుడికి ప్రత్యేకంగా సమర్పించి పూజ చేయడం వల్ల ఆర్థిక నష్టాలు తొలగిపోతాయని.. సంపద పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఇక మందారం పువ్వు యొక్క మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అంతే కాదు సూర్యుడికి మందార పువ్వులను సమర్పించడం వల్ల సంపద కూడా పెరుగుతుంది. ఆయురారోగ్యం మెరుగుపడుతుంది.

Vastu Tips Economic growth if any flowering plant is planted in any direction
Vastu Tips Economic growth if any flowering plant is planted in any direction

2. తామరపువ్వు : లక్ష్మీదేవికి , బుద్ధ భగవానుడి కి తామర పువ్వు అత్యంత ప్రీతికరమైనది. ఇక ఈ పువ్వు ఆధ్యాత్మికతకు చిహ్నం గా పరిగణిస్తారు. తామర పువ్వును ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరగడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకుని ఉంటుందని చెబుతారు. ఈశాన్యం లేదా ఉత్తరం లేదా తూర్పు దిశలో తామర పువ్వు ను ఏర్పాటు చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చెంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.

3. సంపంగి పువ్వులు : లేత తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగులలో దొరికే సంపంగి పువ్వులను స్వామివారికి సమర్పించడం వల్ల అష్ట దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం సంపంగి పువ్వులు అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇక ఇలా పూల మొక్కలను ఇంటి పెరటిలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక సంపద పెరుగుతుంది.