Chanakya Niti : పిల్లలు విజయం పొందాలంటే తల్లిదండ్రులు ఇలా చేయాల్సిందే చాణక్య … !

Chanakya Niti : శిష్యుడు తప్పు చేస్తే .. గురువు బోధనలలో ఏదో లోపం ఉందని అర్థం. అదే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉందని శాస్త్రం చెబుతోంది నిజానికి ఏ తల్లిదండ్రులు అయినా సరే తమ పిల్లల భవిష్యత్తు సక్సెస్ అందుకోవాలని ఆశించడం లో ఏమాత్రం తప్పు లేదు. అయితే పిల్లలలో సంస్కృతి బీజాలను నాటడం.. మంచి చెడుల మధ్య తేడాని గుర్తించడం ఎలాగో నేర్పించినప్పుడే తల్లిదండ్రుల కల నెరవేరుతుంది. ఇక తల్లిదండ్రులు ఇచ్చిన విలువలను పిల్లలు పాటిస్తేనే వారి జీవితం మెరుగుపడుతుంది అని చెప్పడం జరిగింది.ఇకపోతే చాణక్య నీతి ప్రకారం.. పిల్లలు అనేక సార్లు తమ తల్లిదండ్రులకు అబద్ధం చెబుతూ ఉంటారు.

అలాంటి అబద్దాలను తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉన్నట్లయితే అబద్ధాలు చెప్పడం వారికి అలవాటు అయిపోతుంది.అబద్ధాల వల్ల పిల్లల భవిష్యత్తు కూడా పాడడమే కాకుండా అవసరం అయితే తల్లిదండ్రుల విషయంలో కూడా అబద్ధం చెప్పడానికి పిల్లలు వెనుకాడరు. మొదటిసారి పిల్లలు అబద్దం చెప్పినప్పుడే ఆ తప్పులను నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు సరైన దారిలో పెట్టాలి అని చాణిక్య నీతి చెబుతోంది.ఇక మరి కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు.. ఇక తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోరు. ఇలాంటి అలవాట్లను చిన్నతనంలోనే సరిదిద్దు కోవాలి. తల్లిదండ్రులు ప్రేమతో వారికి నేర్పించాలి. లేకపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది . పిల్లల చదువు విషయంలో శ్రద్ధ పెట్టాలి..

Chanakya Niti what parents need to do for their children to succeed
Chanakya Niti what parents need to do for their children to succeed

చదువుతో పాటు మహానుభావుల కథలను కూడా వారికి చెప్పి అందులో దాగి ఉన్న అర్థం పరమార్ధాన్ని పిల్లలకు తెలిసేలా ప్రేరేపించాలి. పిల్లల మనసులో మంచి ఆలోచనలు పెరిగి సమాజంలో గౌరవం సంపాదించుకునేలా ఎదుగుతారు. అంతే కాదు పిల్లలు ఏ విషయాన్ని అయినా ముందుగా ఆలోచించి చేసేలా వారికి నేర్పించాలి. పిల్లలకు మంచి చెడులను నేర్పించినప్పుడు వారు తమ జీవితంలో తప్పుడు పనులు చేయడానికి ముందుకు వెళ్లరు. ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు తల్లిదండ్రులు పాటించినట్లైతే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు గా మారుతుంది. ఇక ఇలా ప్రతి ఒక్కరికి అవసరమైన ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.