ఏ దేవుడికి ఎలాంటి పుష్పాలు సమర్పించాలో తెలుసా..!!

భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడిని పూజించేటప్పుడు తప్పకుండా పువ్వులతో స్వామివారిని అలంకరించి పూజిస్తూ ఉంటారు. అయితే కొంతమంది దేవుళ్ళకు కొన్ని రకాల పువ్వులను మాత్రమే ప్రత్యేకంగా సమర్పించి పూజించడం ఆనవాయితీ. ఇక సనాతన ధర్మం ప్రకారం పువ్వులు లేని పూజ అసంపూర్ణం. కొబ్బరికాయను, పువ్వులను స్వచ్ఛతకు చిహ్నం గా పరిగణిస్తారు. ఇకపోతే దేవతలకు ఇష్టమైన పువ్వులను సమర్పించి పూజ చేయడం వల్ల భగవంతుడు సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.

పువ్వుల పరిమళాలతో ఇంటిలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా ఈ పువ్వులు చేస్తాయి. ఇక ప్రతి ఒక్కరూ పూజ అలంకరణ లో పువ్వులు సమర్పిస్తారు కాబట్టి ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.ఇప్పుడు ఏ దేవుడికి ఎలాంటి పువ్వులను సమర్పించాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Do you know what kind of flowers to offer to any god
Do you know what kind of flowers to offer to any god

మల్లె పువ్వులు : ఈ పువ్వులు చాలా సువాసనను అందిస్తాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మల్లెపూల మాలను స్వామివారికి సమర్పించాలి . ఇక ఈ పూలలో ఔషధ గుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

తెలుపు రంగు పువ్వులు : విద్య దేవత సరస్వతి దేవి కి తెల్లనిపువ్వులు అంటే ఎంతో ప్రీతికరం. సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే తెల్లని పూలతో అమ్మవారిని అలంకరించాలి. ఇక విద్యార్థులు తాము విద్య లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అంటే తప్పకుండా సరస్వతీదేవికి తెల్లని పూలతో పూజ చేయాల్సి ఉంటుంది.

తామర పువ్వు : లక్ష్మీదేవి ఆసీనులైన తామర పువ్వు ఎంతో పవిత్రమైనది. ఈ పూలను లక్ష్మీ పూజ లో లేదా దీపావళి సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, సంపదతో తులతూగుతుంది అని భక్తుల నమ్మకం. దేవాలయాల్లో లేదా ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అమ్మవారికి తప్పకుండా తామరపూలను సమర్పించాలి.

ఎరుపు రంగు పువ్వులు : కాళికామాత కు ఎర్ర మందార పువ్వులను సమర్పించడం వల్ల అమ్మవారు ప్రసన్నం అవుతారట.

పారిజాత పుష్పాలు : ఈ పుష్పాలను విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి సమర్పించవచ్చు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే విరబూసే ఈ పువ్వులు చాలా సువాసనను అందిస్తాయి. ఇక సముద్ర మథనం సమయంలో ఈ పువ్వు జన్మించిందని, ఈ పువ్వు లో అనేక ఔషధ విలువలు ఉన్నాయి అని శాస్త్రం చెబుతోంది.