Mushrooms : క్యాన్సర్ ను అడ్డుకునే పుట్టగొడుగులు.. వారికి మరీ మంచిదట.!!

Mushrooms : సాధారణంగా చాలా మంది పుట్టగొడుగులు తినడానికి అస్సలు ఆసక్తి చూపరు. కానీ మిగతా కూరగాయలు, పండ్ల లాగే వీటికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే బెండకాయలు, వంకాయలు, దొండకాయలు లాంటి రోజూవారీ తినే కూరగాయల కన్నా పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మేలు కలుగ చేస్తాయి. కొత్తగా చేసిన పరిశోధనలో రోజుకు రెండు మూడు పుట్టగొడుగులు తింటే చాలు మంచిదట. ముఖ్యంగా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 45 శాతం వరకు తగ్గిపోతుందట. వీటిల్లో ఉండే ఎర్గోథియోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను శరీరంలో పెరగకుండా అడ్డుకుంటుంది.

కాబట్టి వారానికి రెండు సార్లైనా పుట్టగొడుగులు తింటే క్యాన్సర్ కణాల నుంచి రక్షణ కలుగుతుంది. ఇక పుట్టగొడుగులు పండు కాదు..కూరగాయలు కాదు.. ఇది శిలీంద్రాల జాతికి చెందినవి. చెట్టు దుంగలపై , చెక్కలపై పెరిగే పుట్టగొడుగులను శాకాహారులు కూడా తినవచ్చు. ముఖ్యంగా వీటిలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభించడం వల్ల రక్తపోటును నియంత్రించి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడుతుంటే అలాంటివారు పుట్టగొడుగులు తినడం చాలా మంచిది. గుండె సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి వీటిలో ఉండే బీటా గ్లూకాన్స్ కొలెస్ట్రాల్ స్థాయి ని అదుపులో ఉంచుతుంది.

Mushrooms that prevent cancer very good for them
Mushrooms that prevent cancer very good for them

ఇక డయాబెటిస్ వారు కూడా ఎటువంటి సందేహం లేకుండా పుట్టగొడుగులను పుష్కలంగా తినవచ్చు. పుట్టగొడుగుల లో హైపో గ్లైసమిక్ ఇండెక్స్ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి అభివృద్ధి చెందదు. పైగా రక్తంలో పెరిగే గ్లూకోజ్ ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి వారానికి కనీసం మూడుసార్లు డయాబెటిస్ ఉన్నవారు పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిది. పుట్టగొడుగుల లో ఆయిస్టర్ మష్రూమ్, బటన్ మష్రూమ్ లు చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇక ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. మహిళల్లో వచ్చే రక్తహీనత సమస్య కూడా దూరం అవుతుంది.