Skin Problems : చర్మ సమస్యలను దూరం చేయాలంటే ఇలా చేయండి..!!

Skin Problems : కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక వయసుతో కూడా సంబంధం లేకుండా మొటిమలు, ముడతలు, నల్లటి మచ్చలు, చర్మం పొడిబారిపోవడం , గీతలు పడడం వంటి సమస్యలు కూడా ఎదుర్కోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో చర్మం పై వచ్చే సమస్యలను దూరం చేసుకోవాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించి తీరాల్సిందే. ఇక జనపనార గింజలను ఉపయోగించి చర్మం పై, కనిపించే సన్నని గీతలు, ముడుతలు, మచ్చలు అలాగే వృద్ధాప్య ఛాయలను కూడా సులభంగా తొలగించుకోవచ్చు.

ఇకపోతే మీ ఇంట్లో ఉండే ఆడవారు లేదా మీకు తెలిసిన వారెవరైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారికి ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ముఖ్యంగా అవిసె గింజలను , జనపనార గింజలను ఉపయోగించి డ్యామేజ్ అయిన చర్మాన్ని తిరిగి పొందవచ్చు. ఇక సహజ యవ్వనాన్ని కూడా చర్మం పొందుతుంది. చర్మానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి ఈ గింజలు చాలా బాగా సహాయపడుతాయి. ముఖ్యంగా అవిసగింజల లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల బాక్టీరియాతో పోరాడి వాటిని నాశనం చేయడమే కాదు.. లోపల నుండి చర్మానికి కాంతి అందుతుంది.

Do this to get rid of skin problems
Do this to get rid of skin problems

ఇక అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల చర్మాన్ని తెల్లగా, అందంగా మార్చే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. మొటిమలు, మచ్చలు దూరం చేయాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ముల్తానీమట్టి, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఇక దీనిని మునివేళ్లతో ముఖంపై అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి. 20 నిమిషాలు ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ చిట్కా పాటిస్తే అందమైన ముఖం మీ సొంతమవుతుంది.