Allu Arjun : అల్లూ అర్జున్ గురించి ఆ హీరోయిన్ గురించీ మసాలా రాతలు రాస్తోన్న వెబ్ సైట్స్ .. స్నేహా రెడ్డి కి చెమటలు పట్టే బ్రేకింగ్ న్యూస్ !

Allu Arjun : పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్.పుష్ప త‌ర్వాత బ‌న్నీ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. ఎక్క‌డ‌కు వెళ్లిన కూడా బ‌న్నీ గురించి చర్చ‌. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు ఆయ‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌కు సంబంధించి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మొన్న‌టికి మొన్న అల్లు అర్జున్.. ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో ప్రేమాయ‌ణం న‌డిపాడ‌ని, ఈ విష‌యం తెలుసుకున్న స్నేహా రెడ్డి ఆమెని దూరం పెట్టింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు మ‌రో హీరోయిన్ ఫ్రేమంలోకి వ‌చ్చింది. ఆమె మ‌రెవరో కాదు కేథ‌రిన్ థెస్రా.

fake-news-spread-on-allu-arjun
fake-news-spread-on-allu-arjun

త‌ప్పుడు వార్త‌లు

హీరోయిన్ కేథరిన్ థెరిస్సా.. పుష్ప 2 సినిమాలో కీ రోల్ పోషించ బోతుందని.అది కూడా నెగిటివ్ రోల్ అని టాక్ వినిప‌స్తుండ‌గా, ఆమెకు ఈ అవ‌కాశం ఇవ్వ‌డం వెన‌క బ‌న్నీ ఉన్నాడ‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. కేథ‌రిన్ బ‌న్నీ న‌టించిన ఇద్ద‌ర‌మ్మాయిల‌తో – స‌రైనోడు – రుద్ర‌మ‌దేవి సినిమాల్లో న‌టించింది. ఈ అమ్మ‌డికి పెద్ద‌గా క్రేజ్ లేక‌పోయిన బ‌న్నీ వ‌రుస సినిమా అవ‌కాశాలు ఇవ్వ‌డం వెన‌క అంద‌రిలో అనేక ఆలోచ‌న‌లు త‌లెత్తాయి. అయితే ప్ర‌స్తుతం ఆమెకు ఏ మాత్రం క్రేజ్ లేక‌పోయిన కూడా తీసుకొచ్చి పుష్ప 2లో పెట్టుకున్నాడ‌ట‌.

ఈ మ‌ధ్చ కేథ‌రిన్ న‌టించిన పేరున్న సినిమా ఒక్క బింబిసార మాత్ర‌మే. అస‌లు నాలుగైదేళ్లుగా టాలీవుడ్ కేథ‌రిన్ అనే హీరోయిన్ ఉంద‌ని మ‌ర్చిపోయింది. అలాంటి ఆ హీరోయిన్‌ని బ‌న్నీ రిక‌మెండ్ చేయించి పుష్ప‌2లో ఛాన్స్ ఇచ్చాడ‌నే అంటున్నారు. అస‌లు ఎంతో డీప్ స్నేహం ఉండ‌బ‌ట్టే బ‌న్నీ కేథ‌రిన్ కెరీర్‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుతున్నాడ‌ని కొంద‌రు అంటుంటే, ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌ని కొన్ని వెబ్ సైట్స్ పిచ్చి రాత‌లు రాస్తున్నాయి. ఇవ‌న్నీ చూసి స్నేహా రెడ్డి ఆగ్ర‌హంతో ఊగిపోతుంది.