Daily Astrology : నేటి రాశి ఫలాలు..23 నవంబర్ 2022 బుధవారం రాశి ఫలాలు..! 

Daily Astrology :  మేషం:
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది.. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

Advertisement
Today horoscope.. 23-11-2022 Wednesday horoscope..?
Today horoscope.. 23-11-2022 Wednesday horoscope..?

వృషభం:
నూతన పనులకు శ్రీకారం చుడతారు. నూతన వాహనయోగం కనిపిస్తోంది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

Advertisement

మిథునం:
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి .వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి.

కర్కాటకం:
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. మానసిక ప్రశాంతతకు , పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.

సింహం:
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కన్య:
చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

తుల:
నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూరప్రాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.

వృశ్చికం:
ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానాచలనాలు తప్పవు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా ఉండండి.

ధనస్సు:
రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు , ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు.

మకరం:
చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఏర్పడతాయి. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి.

కుంభం:
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

మీనం:
నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు త్రుటిలో తప్పుతాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది . కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి.

Advertisement