Polavaram: రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు పై సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు..!!

Polavaram: మళ్లీ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం నాడు రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుజనాచౌదరి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కి పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమని పేర్కొన్నారు. విభజన జరిగిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సందర్భాన్ని.. సభలో గుర్తు చేశారు.

తూతూ మంత్రంగా పోలవరం రివర్స్ టెండరింగ్‌.. సుజనాచౌదరి ఫైర్ | Government has to release white paper on polavaram project: mp sujana chowdary demands - Telugu Oneindia

ఇటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు బాధ్యతను పూర్తిగా కేంద్రం తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని లేకపోతే రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకొని త్వరగా కంప్లీట్ చేయాలని రాజ్యసభలో సుజనాచౌదరి సూచించారు.