YS Jagan: ఢిల్లీలో ఫుల్ బిజీగా ఉన్న సీఎం జగన్..!!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. మధ్యాహ్నం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం జగన్ సాయంత్రం ప్రధాని మోడీ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో విభజన అంశాలు మరియు పోలవరం ప్రాజెక్టు ఇంకా.. ఏపీ రాజధానికి సంబంధించి పలు అంశాలపై మోడీ తో… జగన్ చర్చలు జరపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

YS Jagan's Delhi tour confirmed, likely to meet PM Narendra Modi on October 6

అనంతరం ఇద్దరు కేంద్రమంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు అధికార వర్గాల నుండి అందుతున్న సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే ప్రధాని మోడీ తో భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో.. ఆ తర్వాత 9:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం జగన్ చర్చలు జరపనున్నట్లు సమాచారం.