Health Problems : ఆ సమయంలో అరటిపండు తింటే ఇక అంతే..?

Health Problems : అరటి పండు పోషకాల నిధి అని చెప్పవచ్చు. ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు చర్మ సౌందర్యానికి చాలా సమర్థవంతంగా పని చేస్తుంది . అయితే ఎన్నో ప్రయోజనాలను కలిగించే అరటిపండు కొన్ని సందర్భాలలో అలాగే కొన్ని సమయాలలో తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. మీలో ఎవరైనా తరచూ అరటిపండు తింటూ ఉంటే ఈ ఆర్టికల్ ను వారికి షేర్ చేసి ఈ సందేశాన్ని వారికి పంపగలరు. అరటిపండు వల్ల కలిగే అనర్ధాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన పండ్లలో అరటిపండు కూడా ఒకటి. ఇది తిన్న వెంటనే ఎనర్జీ వస్తుంది. అలాగే తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఏడాది పొడవునా తక్కువ ధరకు లభించే పండ్లలో అరటిపండ్లు కూడా ఒకటి . ఇందులో పొటాషియం , మెగ్నీషియం, పీచు వంటి మొదలైన పోషకాలు మెండుగా ఉంటాయి. ఇకపోతే 100 గ్రాముల అరటి పండులో మనకు 258 మిల్లీ గ్రాముల పొటాషియం , 2.6 గ్రాముల పీచు, 14 శాతం విటమిన్ సి, 20 శాతం విటమిన్ బి 6, 6 శాతం మెగ్నీషియం, మాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం

Health problems eating a banana at that time
Health problems eating a banana at that time

వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా శరీరం డీహైడ్రేట్ అయ్యి శక్తిని కోల్పోతుంది. అలాంటప్పుడు అరటిపండు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.ఇకపోతే అరటి పండ్లు ఎప్పుడూ కూడా పాలతో కలిపి తీసుకోకూడదు. రాత్రి నిద్రించే ముందు అరటిపండును తినకపోవడమే మంచిది. ఎందుకంటే జలుబు , గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అరటిపండు తినడం వల్ల శరీరంలో మ్యూకస్ ఏర్పడుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. అల్పాహారం తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా అరటి పండ్లు తినకూడదు.