Beauty Tips : ఇంట్లో ఈ చిట్కాలు పాటిస్తే చాలు ఇకపై పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు

Beauty Tips : పెరుగు.. పాల ఉత్పత్తుల ద్వారా లభించే వాటిలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏడాది పొడవునా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పెరుగు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెరుగును కొంతమంది మజ్జిగ చేసుకుని తాగడానికి ఇష్టపడితే.. మరికొంతమంది అందులో చక్కెర కలుపుకుని తినడానికి ఇష్టపడతారు. ఇకపోతే పెరుగు రుచిని ఆస్వాదించడానికి ఎన్నో మార్గాలు తారసపడతాయి. ఇకపోతే పెరుగు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా చక్కగా సహాయపడుతుంది. పెరుగును ప్రతిరోజూ మనం ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కారం లభిస్తుంది.

ఇకపోతే పెరుగును ఉపయోగించి ముఖానికి మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆలోచిస్తుంటే.. ఈ ఆర్టికల్ ను ఫాలో అవ్వండి . అంతే కాదు మీకు తెలిసిన వారికి అలాగే అక్క ,చెల్లి , ప్రేయసి , భార్య ఇలా ఎవరైనా సరే అందం కోసం ప్రయత్నిస్తారు కాబట్టి వారికి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయగలరు. పెరుగును ఉపయోగించి ముఖానికి మెరుగులు ఎలా దిద్దుకోవాలి అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..పెరుగు చర్మ సంరక్షణలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖం పై అసహ్యంగా కనిపించే మొటిమలను తగ్గించి.. సహజసిద్ధ మెరుపు ను తీసుకురావడం

Beauty Tips in perfect curd at home
Beauty Tips in perfect curd at home

పెరుగు చాలా బాగా పనిచేస్తుంది. గడ్డ పెరుగును ముఖానికి అప్లై చేయడం వల్ల.. పెరుగులో ఉండే లాక్టిక్ ఆసిడ్ చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి.. కొత్త కణాల పుట్టుక లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే ముఖం పై కొత్త కణాలు ఏర్పడతాయో అప్పుడు ముఖం అందంగా తయారవుతుంది.ఇకపోతే పెరుగును తీసుకొని ముఖానికి , మెడకు అప్లై చేసి గుండ్రంగా కింద నుంచి పైకి మర్దనా చేయాలి. సుమారుగా 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీకు వీలు కుదిరినప్పుడల్లా రోజు మార్చి రోజు ఈ చిట్కా పాటిస్తే మీ ముఖం చాలా మృదువుగా తాజాగా కనిపిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే ఈ పెరుగుతో ఖర్చులేకుండా ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.