బ్రేకింగ్: మాజీ మంత్రి అఖిలప్రియకు అస్వస్థత… ఆస్పత్రికి తరలింపు!

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగింది. నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసు నేపథ్యంలో అరెస్ట్ అయిన అఖిలప్రియ కర్నూలు సబ్ జైలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన అఖిలప్రియను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తాజాగా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనిపైన ఇంకా అప్డేట్స్ వెలువడాల్సి వుంది.

ఇకపోతే, నిన్న జరిగిన మొత్తం తంతు విషయమై… యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కి స్వాగతం పలికినందుకు వెళ్లిన సమయంలో ఏవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, ఆమె చున్నీ పట్టి లాగడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని భూమా తరపు వారు ఆరోపణలు చేస్తున్నారు.