బ్రేకింగ్: వాలంటీర్లను ఆకాశానికెత్తేసిన సీఎం జగన్..!

అవును, ఏపీ సీఎం జగన్ తాజాగా వాలంటీర్ల మీద ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వాలంటీర్లు వారధులుగా ఉన్నారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2.66 లక్షల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని గడప గడపకూ చేరవేస్తూ, వివక్షకు చోటు లేకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, మరెవ్వరూ చేయలేని విధంగా వాలంటీర్లు సేవలు చేస్తున్నారని, వారి సేవలు చిరస్మరణీయం అని అన్నారు.

ఈ క్రమంలో వాలంటీర్లు 99 శాతం మంది ఇళ్లకు వెళ్లి మరీ వృద్ధులకు, వికలాంగులకు, బధిరులకు, విధవరాండ్రలకు… ఇంకా అనేకమంది అర్హులైన ప్రతీ పెన్షన్ దారులకీ పెన్షన్ చేరవేస్తున్నారని అన్నారు. ఇటువంటి వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదని జగన్ స్పష్టం చేయడం జరిగింది.