మహేష్ బాబు పాటకు డాన్స్ ఇరగదీసిన మంత్రి రోజా.. ఖుషీ అయిపోతున్న జగనన్న అభిమానులు?

తెలుగు అలనాటి అందాల తార, మంత్రి రోజా గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రోజా అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. తన అందచందాలతో, తనదైన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. అగ్ర హీరోలు అయినటువంటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ సరసన నటిస్తూ స్టార్ హోదాను సొంతం చేసుకుంది. ఇక చిరంజీవితో చేసిన సినిమాలలో అతనికి పోటీగా డాన్స్ వేసిన హీరోయిన్ గా రోజా అప్పట్లో మంచి పేరు సంపాదించుకుంది.

వయసు మీద పడుతున్న కొద్ది కొన్ని సహాయక పాత్రలలో నటించి మెప్పించింది. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి కూడా తనదైన ముద్ర వేసుకుంది. ఆమధ్య సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో మొన్నటి వరకు జడ్జిగా బాధ్యతలు చేప్పట్టి తెలుగు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించింది. ఇక ఎప్పుడైతే మంత్రి బాధ్యతలు చేపట్టిందో అప్పటినుంచి జబర్దస్త్ కూడా దూరమైంది. ఇక జబర్దస్త్ లో ఉన్నంతకాలం రోజా తన ఆటపాటలతో బాగా సందడి చేసేది రోజా.

ఇక అసలు విషయానికొస్తే కొన్నాళ్ల క్రితం ఓ వేదికగా రోజా వేసిన డాన్స్ షో ఇప్పుడు వైరల్ గా మారింది. విషయం ఏమంటే అందులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు పాటకు అదిరిపోయేలా డాన్స్ చేయడమే దానికి కారణం. దాంతో మన ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మరోవైపు జగనన్న అభిమానులు కూడా మంత్రి రోజా వేసిన చిందులకు డాన్సులు వేస్తున్నారు. ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి విదితమే.

రోజా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి విదితమే. స్వతహాగా హీరోయిన్ అయినటువంటి రోజాకు హీరో మహేష్ బాబు యాక్టింగ్ అంటే చేలా ఇష్టమని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది. ఇక అలా డాన్సులు వేస్తూ మరోసారి తన అభిమానాన్ని చాటుకుంది. మహేష్ నటనంటే కేవలం ప్రేక్షకులకే కాకుండా, సినిమా ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టం. ఇదే విషయాన్ని చాలామంది బాహాటంగానే చెప్పుకొచ్చారు.