Kodali Nani: మంత్రి పదవికి రాజీనామా తర్వాత కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!!

Kodali Nani: గురువారం కేబినెట్ భేటీలో 24 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం తెలిసిందే. రాజీనామా చేసిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. ఇక రాజీనామా చేసిన అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానికి 4 కొమ్ములు లేవని తాను కూడా అందరి మాదిరిగానే మంత్రిపదవికి రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు.

Kodali Nani flays Chandrababu, challenges him to resign and win again

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో కొందరికి స్థానం ఉంటుందని చెప్పినా.. నానికి మీడియా నుంచి ప్రశ్నలు రాగా కొడాలి నానికి కొమ్ములు లేవని తెలియజేశారు. కొత్త క్యాబినెట్ లో తనకి స్థానంపై అవకాశాలు తక్కువేనని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మంత్రివర్గంలో అందరం రాజీనామా చేయడం జరిగిందని ఈ నెల 11 వ తారీకు కొత్త క్యాబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుందని.. కొడాలి నాని వ్యాఖ్యానించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉంటే జగన్ ఎక్కువగా బాధపడినట్లు కనిపించిందని.. అని ఇష్టపూర్వకంగానే అందరం రాజీనామా చేయడం జరిగిందని.. అన్నారు.