Hair Problem : తలలో చుండ్రు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

Hair Problem  : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి మహిళ కోరుకున్నట్టుగానే పురుషులు కూడా తమ జుట్టును స్టైలిష్ గా మార్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక పోతే ఈ చుండ్రు సమస్య వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వుంటారు. అయితే ముందుగా మనం ఈ చుండ్రు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటే చుండ్రు సమస్య రాకుండా చేయగలము. సాధారణంగా ఈ సమస్య వచ్చిన తర్వాత దానికి మార్గాలు వెతుక్కోవడం కన్నా సమస్య ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. అయితే చుండ్రు సమస్యతో బాధపడేవారికి ఈ ఆర్టికల్ వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి. చుండ్రు రావడానికి గల ప్రధాన కారణం ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

Do you know the causes of dandruff on the head
Do you know the causes of dandruff on the head

ఫంగల్ ఇన్ఫెక్షన్ : ఇతరులతో దువ్వెన పంచుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందట. తరచూ తలస్నానం చేయకపోవడం, తలపై చెమట పేరుకుపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.. కాబట్టి ఇతరులతో దువ్వెనలు, టవల్ లాంటివి పంచుకోవద్దు.

తలస్నానం చేయకపోవడం : చాలామందికి తలస్నానం చేయడం అంటే చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది . అందుకే వాళ్ళు కేవలం వారానికి ఒకసారి మాత్రమే తల స్నానం చేస్తారు . అయితే తలస్నానం చేయకపోవడం వల్ల పర్యావరణం లో ఉండే దుమ్ము, ధూళి అన్ని జుట్టు పై పేరుకుపోయి, ఫలితంగా చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వారానికి కనీసం రెండు సార్లయినా శుభ్రంగా తలస్నానం చేయడం మంచిది.

షాంపూలను సరిగ్గా కడగకపోవడం : చాలామంది ఎక్కువ షాంపూ తో తలస్నానం చేస్తూ ఉంటారు..ఇలా చేయడం వల్ల స్కాల్ఫ్ మీద షాంపూ పేరుకుపోయి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది . ఫలితంగా చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి షాంపూ తో స్నానం చేసినప్పుడు శుభ్రంగా షాంపు తొలగిపోయే వరకు స్నానం చేయండి.